Srisailam: పోటెత్తిన వరద... రేపు తెరచుకోనున్న శ్రీశైలం డ్యామ్ గేట్లు!

  • 3.71 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో
  • 173 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ
  • నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి

జూరాల నుంచి శ్రీశైలానికి వస్తున్న వరద మరింతగా పెరిగింది. ఉజ్జయిని, భీమ, తుంగభద్ర నదుల్లో వరద నీరు అధికంగా ఉండటంతో శ్రీశైలం వద్ద ఇన్ ఫ్లో ఈ ఉదయం 3.71 లక్షల క్యూసెక్కులకు చేరింది. ప్రస్తుతం 877 అడుగుల నీటిమట్టం ఉండగా, నీటి నిల్వ 173 టీఎంసీలుగా ఉంది.

శనివారం ఉదయానికి రిజర్వాయర్, గరిష్ట నీటిమట్టానికి చేరుకోనుంది. దీంతో రేపు క్రస్ట్‌ గేట్లు ఎత్తి సాగర్‌ కు నీటిని విడుదల చేయనున్నామని అధికారులు అంటున్నారు. ఇదే సమయంలో శ్రీశైలం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే అన్ని కాలువలు, ఎత్తిపోతల పథకాలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News