Team India: టాస్ గెలిచిన టీమిండియా... వర్షం కారణంగా తొలి వన్డే ప్రారంభం ఆలస్యం

  • ఫీల్డింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీ
  • ప్రావిడెన్స్ లో టీమిండియా, వెస్టిండీస్ మధ్య వన్డే మ్యాచ్
  • వర్షం కారణంగా 43 ఓవర్లకు మ్యాచ్ కుదింపు
టీమిండియాను వరుణుడు వదలడంలేదు. మొన్నటి వరల్డ్ కప్ లో విజయావకాశాలపై దెబ్బకొట్టిన వాన వెస్టిండీస్ పర్యటనలోనూ వెన్నంటే నిలిచింది. తాజాగా, ప్రావిడెన్స్ లో తొలి వన్డే ప్రారంభం వర్షం కారణంగా ఆలస్యమైంది. దాంతో మ్యాచ్ ను 43 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా పలుమార్పులు చేసింది. శ్రేయాస్ అయ్యర్, కేదార్ జాదవ్, మహ్మద్ షమీ, ఖలీల్ అహ్మద్, కుల్ దీప్ యాదవ్ తుదిజట్టులోకి వచ్చారు. ఇక, విండీస్ విషయానికొస్తే గేల్ కు ఇదే చివరి సిరీస్ అని భావిస్తున్నారు. ఈ సిరీస్ తర్వాత గేల్ క్రికెట్ కు గుడ్ బై చెబుతాడని ప్రచారం జరుగుతోంది.
Team India
West Indies
Toss
ODI

More Telugu News