Paderu: గిరిజన ప్రాంతంలో మెడికల్ కాలేజి ఏర్పాటుపై ఏపీ సర్కారు కీలక నిర్ణయం

  • పాడేరులో మెడికల్ కాలేజి ఏర్పాటు
  • వైఎస్సార్ ట్రైబల్ మెడికల్ కాలేజిగా నామకరణం
  • పాడేరు ఏరియా ఆసుపత్రి భవనాల్లో కళాశాల నిర్వహణ

రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు సైతం వైద్యసేవలు అందించే క్రమంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ జిల్లా పాడేరులో గిరిజన వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రస్తుతానికి పాడేరు ఏరియా ఆసుపత్రి భవనాల్లోనే కళాశాల నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మెడికల్ కాలేజీకి వైఎస్సార్ గిరిజన వైద్య కళాశాలగా నామకరణం చేశారు. త్వరలోనే దీనికి సంబంధించిన విధివిధానాలకు రూపకల్పన చేయనున్నారు.

More Telugu News