Kiya: ఏపీలో ‘కియా’ పరిశ్రమ తొలి కారు విడుదల.. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు

  • ‘కియా’ పరిశ్రమ తొలి కారు సెల్టోస్ మార్కెట్లోకి విడుదల
  • ఆటోమొబైల్ రంగంలో ‘కియా’ నూతన ట్రెండ్ తీసుకురావాలి
  • ఆ సంస్థ విజయవంతంగా నడవాలి

ఏపీలో చంద్రబాబు హయాంలో ‘కియా’ మోటార్స్ తమ విభాగాన్ని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ‘కియా’ పరిశ్రమ తొలి కారు సెల్టోస్ ఈరోజు మార్కెట్లోకి విడుదలైంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘కియా’ సంస్థను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. ఆటోమొబైల్ రంగంలో ‘కియా’ నూతన ట్రెండ్ తీసుకురావాలని, ఆ సంస్థ విజయవంతంగా నడవాలని ఆకాంక్షించారు. కాగా, ‘కియా’ పరిశ్రమ కొత్త కారును మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శంకరనారాయణ లాంఛనంగా విడుదల చేశారు.  

More Telugu News