Andhra Pradesh: విజయవాడ, తిరుపతి ఘటనలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి!: పవన్ కల్యాణ్ డిమాండ్

  • ఎన్ఎంసీకి వ్యతిరేకంగా జూడాల ఆందోళన
  • విజయవాడ, తిరుపతిలో పోలీసులతో వాగ్వాదం
  • విజయవాడలో పోలీసుల దాడిపై స్పందించిన జనసేనాని

విజయవాడలో నిన్న జాతీయ మెడికల్ కమిషన్ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్ పై విజయవాడ డీసీపీ హర్షవర్థన్ చేయిచేసుకోవడాన్ని ఖండిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్లు పేదలకు వైద్య సేవలు అందిస్తున్నారనీ, వారి డిమాండ్ పై సానుకూలంగా స్పందించకపోగా, ఇలా దాడిచేయడం సరికాదని హితవు పలికారు.

విజయవాడ, తిరుపతిలో చోటుచేసుకున్న ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. అలాగే యువ వైద్యుల్లో మనోధైర్యం, మానసిక స్థైర్యం నింపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జనసేనాని అభిప్రాయపడ్డారు. 

  • Loading...

More Telugu News