tibet: ఆర్టికల్ 370 రద్దు.. భారత్ అంతర్గత వ్యవహారం: టిబెట్ ప్రవాస అధ్యక్షుడు

  • భారత అంతర్గత విషయాల్లో మేం జోక్యం చేసుకోం 
  • తమ ప్రధాన సమస్యల్లో టిబెట్ ఒకటని చైనా చెబుతోంది
  • భారత్ కూడా అచ్చం ఇలాగే చెప్పాలి

జమ్మూ కశ్మీర్ పునర్విభజనను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వేళ.. ప్రవాసంలో ఉన్న టిబెట్ అధ్యక్షుడు లోబ్‌సంగ్ సంగయ్ భారత్ కు మద్దతుగా నిలిచారు. 370 అధికరణ రద్దు అనేది భారత అంతర్గత వ్యవహారమని తేల్చి చెప్పారు. భారత అంతర్గత విషయాలపై తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. అంతేకాదు, టిబెట్ భౌగోళిక రాజకీయ, చారిత్రక, పర్యావరణ ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రాంత ప్రధాన సమస్యల్లో స్వయం ప్రతిపత్తి కూడా ఒకటని గుర్తించాలని భారత్‌ను కోరారు.

తమ ప్రధాన సమస్యలలో టిబెట్ ఒకటి అని చైనా చెబుతోందని, భారత ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని చెప్పాలని లోబ్‌సంగ్ కోరారు. భౌగోళికంగా, రాజకీయంగా టిబెట్ చాలా ముఖ్యమైనదని ఆయన పేర్కొన్నారు. టిబెట్-భారత్ మధ్య ఉన్న 2500-3000 పొడవైన సరిహద్దు ఇప్పుడు భారతదేశం- చైనా మధ్య సరిహద్దులో ఉందన్నారు. గతంలో కాకుండా భారత ప్రభుత్వం ఇప్పుడు బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోందని,  ఈ డబ్బు విద్య కోసం ఖర్చు చేయొచ్చని లోబ్‌సంగ్ సూచించారు.

  • Loading...

More Telugu News