Kesineni Nani: కెనరా బ్యాంక్ బకాయిలు కట్టేసిన కేశినేని నాని!

  • కెనరా బ్యాంకు నుంచి రుణం
  • తీసుకున్న కేశినేని కార్గో క్యారియర్స్
  • డబ్బు చెల్లించారని బ్యాంకు నుంచి లెటర్
కెనరా బ్యాంకుకు చెల్లించాల్సిన మొత్తాన్ని విజయవాడ ఎంపీ కేశినేని నాని చెల్లించేశారు. ఇందుకు సంబంధించిన పత్రాన్ని లింగమనేని శివరామప్రసాద్ తన ఫేస్ బుక్ ఖాతాలో పంచుకున్నారు. గతంలో కేశినేని కార్గో క్యారియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కెనరా బ్యాంకు నుంచి రూ. 1.34 కోట్లను ఓ మారు, రూ. 1.29 కోట్లను మరోమారు తీసుకుంది. ఈ డబ్బులను చెల్లించాలని గతంలోనే బ్యాంకు నోటీసులు ఇచ్చింది. తాజాగా ఆ బకాయిని కేశినేని నాని ఆధ్వర్యంలోని సంస్థ చెల్లించగా, డబ్బు ముట్టినట్టు బ్యాంకు నుంచి సమాచారం అందింది. దాన్నే లింగమనేని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.
Kesineni Nani
Cenara Bank
Loan
Rapayment

More Telugu News