Jammu And Kashmir: ఇక అందమైన కశ్మీరీ అమ్మాయిలను పెళ్లి చేసుకునేందుకు అడ్డంకులు లేవు: బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ

  • కతౌలి బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
  • ఇప్పుడు దర్జాగా కశ్మీర్ వెళ్లొచ్చు
  • ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల విమర్శలు
జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు, పునర్విభజన బిల్లుకు ఆమోదం లభించండంపై దేశ ప్రజలతో పాటు బీజేపీ శ్రేణులు సంతోషంగా ఉన్న తరుణంలో ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని కతౌలికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ ఈ వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ కోసం పని చేసే బ్యాచ్ లర్స్ ఇప్పుడు దర్జాగా కశ్మీర్ వెళ్లొచ్చని, అక్కడ ప్లాట్లు, భూములు కొనుగోలు చేసుకోవచ్చని చెప్పిన విక్రమ్ సైనీ, అందమైన కశ్మీరీ అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేవని వ్యాఖ్యానించారు. కాగా, ఆర్టికల్ 370 రద్దు కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ నిన్న ముజఫరాబాద్ లోని బీజేపీ జిల్లా శాఖ అభినందన సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో పాల్గొన్న సైనీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలకు చేరింది. సైనీ వ్యాఖ్యలపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
Jammu And Kashmir
BJP
MLA
Vikram shaini

More Telugu News