Andhra Pradesh: ఆహా.. జగన్ పరిపాలన అపూర్వం!: నారా లోకేశ్ సెటైర్లు

  • అందరూ రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు
  • పింఛన్ లో ఇప్పటికే రూ.750 కోత పెట్టారు
  •  దాన్ని కూడా 40 శాతం మందికి ఇవ్వలేదు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. తాజాగా పింఛన్ల పంపిణీ విషయంలో ఏపీ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లోకేశ్ విమర్శించారు. ఈరోజు ట్విట్టర్ లో నారా లోకేశ్ స్పందిస్తూ..‘వీళ్ళు.. వాళ్ళు అని కాకుండా, చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా అందరూ రోడ్డెక్కి నిరసనలు తెలిపేలా చేస్తున్న వైఎస్ జగన్ గారి పాలన అపూర్వం.

రూ.3,000 పింఛను హామీలోనే రూ.750 కోత. అందులోనూ మళ్ళీ 40 శాతం మందికి కోత. కనీసం అదైనా ఒకటో తేదీన ఇవ్వకుండా పది రోజులు తిప్పించుకోవడం. ఆహా! ఏమి సంక్షేమ పాలన?’ అని చురకలు అంటించారు.
Andhra Pradesh
Jagan
Chief Minister
Twitter
Nara Lokesh
pension

More Telugu News