Andhra Pradesh: గుంటూరులో విజిలెన్స్ దాడులు.. భారీగా ఎరువుల నిల్వలు స్వాధీనం!

  • ఖరీఫ్ సీజన్ లో నెలకొన్న కొరత
  • 1193 బస్తాల ఎరువులు జప్తు
  • అనధికారికంగా నిల్వ చేసిన షాపు యజమానులు
ఆంధ్రప్రదేశ్ లో ఖరీఫ్ సీజన్ పంటలకు సంబంధించి ఎరువుల కొరత నెలకొనడంపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. గుంటూరు జిల్లాలోని పలు ఎరువుల దుకాణాలపై ఈరోజు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 1,193 ఎరువుల బస్తాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా ఎరువుల బస్తాలను అక్రమంగా నిల్వచేసి కృత్రిమ కొరత సృష్టించినందుకు షాపుల యజమానులపై కేసులు నమోదుచేశారు.

కాగా, ఈ ఎరువుల విలువ బహిరంగ మార్కెట్ లో రూ.11.50 లక్షలు ఉంటుందని ఓ విజిలెన్స్ అధికారి తెలిపారు. ఈ ఎరువుల బస్తాలను అనధికారిక ప్రాంతాల్లో నిల్వ చేస్తున్నారనీ, రైతులకు బిల్లులు కూడా ఇవ్వడం లేదని తమ తనిఖీలో తేలినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా రికార్డుల్లో ఉన్న ఎరువుల నిల్వలకు, వాస్తవ నిల్వలకు అసలు పొంతనే లేదన్నారు.
Andhra Pradesh
Guntur District
vigillannce
Andhra Pradesh Vigilance Commission
raids
fertilizers

More Telugu News