పాక్ ఆక్రమిత కశ్మీర్ ను ఎలా స్వాధీనం చేసుకోవాలో మాకు తెలుసు: అమిత్ షా
- పీఓకేలోని 25 స్థానాలకూ ఎన్నికలు నిర్వహిస్తామన్న అమిత్ షా
- పీఓకే ముమ్మాటికీ జమ్మూకశ్మీర్ లో అంతర్భాగమేనంటూ ఉద్ఘాటన
- పరిస్థితులు చక్కబడితే జమ్మూకశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర హోదా ఇస్తామని లోక్ సభ సాక్షిగా వెల్లడి
1948లో భారత సేనలు పాక్ ఆర్మీని తరుముకుంటూ బాలాకోట్ వరకు వెళ్లాయని, ఇంతలోనే నెహ్రూ భారత బలగాలను వెనక్కి పిలిపించారని, ఈ కారణంగానే పీఓకే మనకు దూరమైందని అమిత్ షా సభలో వివరించారు. పీఓకే ముమ్మాటికీ జమ్మూకశ్మీర్ లో అంతర్భాగమేనని అమిత్ షా స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో ఏడు దశాబ్దాల సమస్యకు తెరపడిందని అన్నారు. ఈ ఆర్టికల్ కారణంగానే కశ్మీర్ ను భారత్ నుంచి వేరుగా చూశారని, ఇప్పుడా పరిస్థితి లేదని తెలిపారు. మోదీ ప్రభుత్వం ఎవరికీ తలొగ్గదని ఉద్ఘాటించారు.