Raja Ravindra: నిఖిల్ నా మాట నమ్మి చేస్తే, ఆ సినిమా ఫ్లాప్ అయింది: రాజా రవీంద్ర

  • నేను చేయించినవి కొన్ని హిట్టయితే, కొన్ని ఫ్లాపయ్యాయి 
  • నిఖిల్ 'శంకరాభరణం' చేయనన్నాడు 
  • ఆడియన్స్ లోకి వెళ్లాకే సినిమా ఏమౌతుందో తెలుస్తుంది
రాజా రవీంద్ర ఒక వైపున నటుడిగా విభిన్నమైన పాత్రలను చేస్తూనే మరో వైపున కొంతమంది హీరోలకి మేనేజర్ గాను చేస్తున్నాడు. ఆ హీరోల దగ్గరికి వచ్చే కథలను ఆయనే ముందుగా వింటాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఇదే విషయాన్ని గురించి ప్రస్తావించాడు.

"నేను కథలు విని హీరోలతో చేయించిన సినిమాలు కొన్ని విజయవంతమైతే మరికొన్ని పరాజయం పాలయ్యాయి. నిఖిల్ .. రాజ్ తరుణ్ విషయంలో ఇలా ఎక్కువసార్లు జరిగింది. కోన వెంకట్ నిర్మించిన 'శంకరాభరణం' సినిమా చేయడం నిఖిల్ కి ఇష్టం లేదు. అయినా నేను చేయమంటేనే చేశాడు .. అది కాస్తా పరాజయం పాలైంది. ఒక సినిమా హిట్ అవుతుందా .. అవ్వదా? అనేది ఎవరూ పూర్తిగా జడ్జ్ చేయలేరు. ఆడియన్స్ లోకి వెళ్లే వరకూ సినిమా ఏమవుతుందనేది ఎవరూ జడ్జ్ చేయలేరు" అని చెప్పుకొచ్చాడు.
Raja Ravindra

More Telugu News