Nara Lokesh: మా కఠోర శ్రమకు ఫలితం ఇదిగో: 'హెచ్ సీఎల్' ఉద్యోగ ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన నారా లోకేశ్

  • విజయవాడలో రిక్రూట్ మెంట్ డ్రైవ్ ప్రకటించిన హెచ్ సీఎల్
  • మీ కృషి ఫలితమే ఇదంటూ ఓ కార్యకర్త ట్వీట్
  • స్పందించిన లోకేశ్
టీడీపీ యువనేత నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా తమ ఆనందం పంచుకున్నారు. ప్రముఖ ఐటీ దిగ్గజం హెచ్ సీఎల్ విజయవాడ బ్రాంచ్ కు ఇంజినీర్లు కావాలంటూ ఇచ్చిన ప్రకటన ఆయనకు సంతోషాన్ని కలిగించింది. హెచ్ సీఎల్ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ప్రకటన పట్ల స్పందించిన ఓ టీడీపీ అభిమాని, హెచ్ సీఎల్ ను విజయవాడ తీసుకువచ్చిన మీ కృషిని అభినందిస్తున్నాం అన్నా అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. మా శ్రమ ఫలించడం చూస్తుంటే హ్యాపీగా ఉంది అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
Nara Lokesh
HCL
Vijayawada
Telugudesam

More Telugu News