j and k bank: కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి రానున్న జమ్ము అండ్ కశ్మీర్ బ్యాంక్

  • ఇంత కాలం ప్రత్యేక ప్రతిపత్తిని అనుభవించిన జమ్ము అండ్ కశ్మీర్ బ్యాంక్
  • బ్యాంకులో 60 శాతం వాటా ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే
  • కేంద్రపాలిత ప్రాంతం కానుండటంతో.. కేంద్రం పరిధిలోకి రానున్న బ్యాంకు

ఆర్టికల్ 370 రద్దు కానుండటంతో జమ్ము అండ్ కశ్మీర్ బ్యాంకును తన అధీనంలోకి తీసుకునే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. ఇప్పటి వరకు ఈ బ్యాంకు ఆర్టికల్ 370 ద్వారా సంక్రమించిన ప్రత్యేక ప్రతిపత్తి వల్ల ఆర్థిక వ్యవహారాలు, నిర్వహణలో ప్రత్యేక సౌకర్యాలను అనుభవిస్తూ వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఆర్బీఐతో సమానంగా వ్యవహరించింది.

ఈ బ్యాంకులో 60 శాతం వరకు జమ్ముకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంది. ఇప్పుడు జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం కావడంతో ఆ బ్యాంకుకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ వాటాలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతికి రానున్నాయి. బ్యాంకు సీఈవో, బోర్డు డైరెక్టర్లను నియమించే అధికారాలు కేంద్ర ఆర్థికశాఖకు సంక్రమించనున్నాయి. మరోవైపు, మరో జాతీయ బ్యాంకులో ఈ బ్యాంకును విలీనం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

జమ్ము అండ్ కశ్మీర్ బ్యాంకుపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. టెర్రరిస్టులకు, వేర్పాటువాదులకు నిధులను తరలించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, జమ్ముకశ్మీర్ లో రాష్ట్రపతి పాలనను తీసుకొచ్చిన తర్వాత బ్యాంకు ఛైర్మన్ పదవి నుంచి పర్వేజ్ అహ్మద్ ను తొలగించారు.

More Telugu News