India: తదుపరి లక్ష్యం పాక్ ఆక్రమిత కశ్మీరే!: సుబ్రహ్మణ్య స్వామి

  • పీఓకే ఇండియా పరిధిలోకి వస్తుంది
  • ట్రంప్ ముందున్న మధ్యవర్తిత్వం కూడా అదే
  • పార్లమెంట్ ఎదుట సుబ్రహ్మణ్యస్వామి

జమ్ము కశ్మీర్ ను ఇప్పుడు పూర్తిస్థాయిలో ఇండియాలో కలుపుతూ, ఆర్టికల్ 370ని రద్దు చేసిన నేపథ్యంలో ఇక తమ తదుపరి లక్ష్యం పాక్ ఆక్రమిత కశ్మీరేనని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకే కూడా ఇండియా పరిధిలోకి తిరిగి వస్తుందన్న నమ్మకం తనకుందని అన్నారు.

పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడిన ఆయన, కశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం చేస్తానన్న ట్రంప్ వ్యాఖ్యలను గుర్తు చేశారు. పీఓకేను ఇండియాకు అప్పగించాలని చెప్పడం తప్ప, ట్రంప్ ముందు మరో మార్గం లేదని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు ఓ సాహసోపేతమైన చర్యని, తాను మోదీ, అమిత్ షాలకు ప్రత్యేకంగా అభినందనలు చెబుతున్నానని అన్నారు.

ఇప్పటికే ఆర్టికల్ 370 రద్దు చాలా ఆలస్యమైందని, ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు చేస్తున్నవారికి నాడు కశ్మీరీ పండిట్ లను, సిక్కులను తరిమేసిన రోజులు గుర్తుకు రావడం లేదా? అని సుబ్రహ్మణ్యస్వామి ప్రశ్నించారు.

More Telugu News