Jagan: ముఖ్యమంత్రి జగన్‌పై అసభ్యకర పోస్టులు.. ఇద్దరి అరెస్ట్

  • ఒకరు చేసిన పోస్టింగులు మరొకరు షేర్ చేసిన వైనం
  • ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకులు
  • ఇద్దరికీ రెండు వారాల రిమాండ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్టింగులు పెట్టిన ఇద్దరు వ్యక్తులను జగ్గయ్యపేట పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు వీరికి రెండువారాల రిమాండ్ విధించింది. పట్టణానికి చెందిన చల్లపల్లి అవినాశ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో జగన్‌‌పై అభ్యంతరకర పోస్టులు చేయగా, చిల్లకల్లుకు చెందిన ఏనిక గోపి వాటిని షేర్ చేసినట్టు పోలీసులు తెలిపారు. వైసీపీ నాయకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు.  
Jagan
YSRCP
Facebook
jaggayyapet
Andhra Pradesh

More Telugu News