Police: పోలీసుల వద్ద ఉన్న తన ఫొటో బాగాలేదని ఓ సెల్ఫీ తీసి పంపిన నిందితుడు

  • లింకన్ షైర్ లో విచిత్ర ఘటన
  • స్టీఫెన్ మర్ఫీ అనే యువకుడి కోసం పోలీసుల గాలింపు
  • ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో మర్ఫీ నిందితుడు

నేరాలకు పాల్పడిన క్రిమినల్స్ కోసం పోలీసులు 'మోస్ట్ వాంటెడ్' ప్రకటనలు ఇవ్వడం సర్వసాధారణం. ఆ ప్రకటనల్లో సదరు నేరస్తుడి ఫొటో తప్పనిసరిగా ఉంటుంది. ఇక విషయానికి వస్తే, లింకన్ షైర్ కు చెందిన స్టీఫెన్ మర్ఫీ అనే నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా వెదుకుతున్నారు. అందుకోసం మోస్ట్ వాంటెడ్ ప్రకటన ఇచ్చి అందులో అతని ఫొటో పెట్టారు. ఆ ప్రకటనను స్టీఫెన్ మర్ఫీ కూడా చూశాడు. కానీ ఆ ప్రకటనలో తన ఫొటో ఏమంత బాగాలేదని, తన అందాన్ని ఆ ఫొటో సరిగా ప్రజెంట్ చేయలేకపోతోందని భావించిన స్టీఫెన్ మర్ఫీ వెంటనే ఓ సెల్ఫీ తీసి ఆ ఫొటోను పోలీసులకు పంపాడు.

మీ వద్ద ఉన్న నా చెత్త ఫొటోలను తీసేసి, నేను ఫ్రెష్ గా పంపిన ఫొటోలను పెట్టండి... అప్పుడు మీరు నన్ను ఈజీగా గుర్తుపట్టేందుకు వీలవుతుంది అంటూ సలహా కూడా ఇచ్చాడు. ప్రముఖ సాకర్ ఆటగాడు డేవిడ్ బెక్ హామ్ కూడా అందం విషయంలో తనముందు దిగదుడుపేనని చెప్పుకునే స్టీఫెన్ మర్ఫీ ఓ మాజీ మోడల్. అయితే ప్రభుత్వ ఆస్తులు నాశనం చేశాడన్న ఆరోపణలపై అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మర్ఫీ గతంలో మిస్టర్ బోస్టన్ పోటీల్లో విజేతగా నిలిచాడు.

More Telugu News