Telangana: రేపు మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శించనున్న సీఎం కేసీఆర్

  • గోలివాడ్ పంప్ హౌజ్, ధర్మపురి పుణ్య క్షేత్రాలను కూడా
  • ప్రత్యేక హెలికాఫ్టర్ లో బయలుదేరి వెళ్లనున్న కేసీఆర్
  • కేసీఆర్ వెంట వెళ్లనున్న అధికారులు, ఇంజనీర్లు
మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు దాదాపు 140 కిలోమీటర్ల మేర సజీవంగా మారిన గోదావరిని వీక్షించే నిమిత్తం రేపు ఆయా ప్రాంతాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్, గోలివాడ్ పంప్ హౌజ్, ధర్మపురి పుణ్య క్షేత్రాలను ఆయన సందర్శించనున్నారు. రేపు ఉదయం పది గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ లో కేసీఆర్ బయలుదేరి వెళ్లనున్నట్టు సమాచారం. కేసీఆర్ వెంట అధికారులు, ఇంజనీర్లు కూడా వెళ్లనున్నారు. 
Telangana
cm Kcr
Dharmapuri
Medigadda

More Telugu News