Kalvakuntla Kavitha: ఆర్టికల్ 370 రద్దుపై కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు

  • ఆర్టికల్ 370 రద్దుపై పార్లమెంటులో ప్రకటన చేసిన కేంద్రం
  • ట్విట్టర్ లో స్పందించిన కవిత
  • జమ్మూకశ్మీర్ లో చారిత్రక మార్పులు చోటుచేసుకోనున్నాయని వ్యాఖ్యలు
గత కొన్నిరోజులగా నెలకొన్న ఉత్కంఠకు కేంద్రం నేటితో తెరదించింది. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నట్టు రాజ్యసభలో ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో, ఎన్డీయే సర్కారు నిర్ణయంపై మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఆర్టికల్ 370 రద్దు జమ్మూకశ్మీర్ లో చారిత్రక మార్పులకు దారితీయనుందని వ్యాఖ్యానించారు. కశ్మీర్ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రశాంత జీవనానికి భంగం కలగకపోవచ్చని ట్వీట్ చేశారు. జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో ప్రజలకు మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
Kalvakuntla Kavitha
Jammu And Kashmir
Article 370

More Telugu News