Hyderabad: జమ్మూకశ్మీర్ ఎఫెక్ట్: హైదరాబాద్ లో ర్యాలీలు, ప్రదర్శనలు నిషేధం

  • ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటన
  • అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచన
  • హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోని సున్నిత ప్రాంతాల్లో 144 సెక్షన్
కేంద్రం సాహసోపేతమైన రీతిలో జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, హైదరాబాద్ లో ర్యాలీలు, ప్రదర్శనలపై పూర్తిస్థాయిలో నిషేధం విధించారు. తెలంగాణలోని పోలీసు విభాగం, ఉన్నతాధికారులు పరిస్థితుల పట్ల నిరంతర సమీక్షలు చేపడుతుండాలని కేంద్రం స్పష్టం చేసింది. దాంతో, రాష్ట్రంలోని పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోని సున్నితమైన ప్రాంతాల్లో 144 సెక్షన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు, ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ స్వయంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వివరించారు. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తదనంతర పరిణామాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Hyderabad
Jammu And Kashmir

More Telugu News