Jammu And Kashmir: ఏం జరగబోతోందో మాకు తెలియడం లేదు.. ప్రజలంతా ప్రశాంతంగా ఉండండి!: ఒమర్ అబ్దుల్లా

  • దేవుడు ఏది చేసినా మన మంచికే
  • ప్రజలంతా జాగ్రత్తగా, ప్రశాంతంగా ఉండండి
  • ట్విట్టర్ లో స్పందించిన ఎన్సీ ఉపాధ్యక్షుడు

జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసిన సంగతి తెలిసిందే. దీనికి తోడుగా రాష్ట్రాన్ని, లడఖ్, జమ్మూకశ్మీర్ అంటూ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడదీసింది. ఈ మేరకు రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు.

ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ‘నేను కశ్మీర్ ప్రజలకు ఒకటే చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు ఏం జరగబోతోందో మాకు తెలియదు. కానీ ఆ అల్లాహ్ ఏది చేసినా మన మంచి కోసమే చేశాడని నేను నమ్ముతాను.

దీని ఫలితం ఇప్పుడు కాకున్నా కొద్దిరోజుల తర్వాత కనిపిస్తుంది. ఇప్పుడు ప్రతీఒక్కరూ జాగ్రత్తగా, సురక్షితంగా ఉండండి. ఎవ్వరూ ఆందోళన చెందవద్దు. ప్రశాంతంగా ఉండండి’ అని ట్వీట్ చేశారు.

More Telugu News