Hyderabad: శిథిలావస్థకు చేరిన భవనాలను ఖాళీ చేయాలి: జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్

  • కూకట్ పల్లి సర్కిల్ పరిధిలో కమిషనర్ పరిశీలన
  • వేలాడుతున్న కేబుళ్లను తొలగించాలని ఆదేశం
  • రోడ్లపై గుంతలను పూడ్చే చర్యలు త్వరగా చేపడతాం
హైదరాబాద్ లో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కూకట్ పల్లి సర్కిల్ పరిధిలోని నిజాంపేట్, ఉషాముళ్లపూడి రోడ్డును జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ పరిశీలించారు. నిజాంపేట్ రోడ్డులో విద్యుత్ స్తంభాలకు వేలాడుతున్న ఇంటర్నెట్ కేబుళ్లు, టీవీ కేబుళ్లను తొలగించాలని ఆదేశించారు. రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయని, వాటిని పూడ్చే చర్యలు త్వరగా చేపడతామని అన్నారు. శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో ఉంటున్న వారు వెంటనే ఖాళీ చేయాలని సూచించారు.
Hyderabad
Ghmc
commissioner
Dana kishore

More Telugu News