Jammu And Kashmir: యాత్రీకులకు ముప్పుందనే కశ్మీర్‌లో ముందుజాగ్రత్త చర్యలు : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

  • అంతకు మించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
  • ప్రజల భద్రతకు ఎటువంటి ఢోకా లేదు
  • ఎన్‌ఐటీ నుంచి తెలుగు విద్యార్థుల తరలింపు

జమ్ముకశ్మీర్‌లో ఆందోళన చెందాల్సినంత పరిస్థితి ఏమీ లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఐబీ సూచన మేరకు పౌరులు, యాత్రీకుల భద్రతకు ముందస్తు జాగ్రత్తల్లో భాగమే బలగాల తరలింపు అన్నారు. జమ్ముకశ్మీర్‌లోని తెలుగు ప్రజలంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు. అమర్‌నాథ్‌ యాత్రీకులకు ఎటువంటి ఇబ్బంది రాకూడదనే ప్రభుత్వం వారిని వెనక్కి రావాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాల సందర్శకులు స్వస్థలాలకు వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అక్కడి ఎన్‌ఐటీలో చదువుతున్న 20 మంది తెలుగు విద్యార్థులు ఇప్పటికే ఢిల్లీ బయలుదేరారని తెలిపారు. ఈరోజు మధ్యాహ్నానికి వారు ఢిల్లీ చేరుకుంటారన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన మిగిలిన 90 మంది విద్యార్థులు ఈరోజు ఉదయం ప్రత్యేక రైలులో బయలుదేరుతున్నారని తెలిపారు.

  • Loading...

More Telugu News