USA: విమానంలో గబ్బిలం చక్కర్లు.. హడలిపోయిన ప్రయాణికులు!

  • అమెరికాలోని నార్త్ కరోలినాలో ఘటన
  • విమానంలో దూరిన గబ్బిలం
  • వాష్ రూముల్లో దాక్కున్న ప్రయాణికులు
మన ఇంట్లో చిన్న పురుగు కనిపిస్తేనే అంతెత్తున ఎగిరిపడతాం. అదే ఏకంగా గబ్బిలం వచ్చేస్తే! మన చుట్టూ ఎగురుతుంటే? తలచుకుంటేనే చాలామందికి భయం వేస్తుంది. తాజాగా ఇలాంటి అనుభవమే అమెరికా వాసులకు ఎదురైంది. అమెరికాలోని నార్త్ కరోలినా నుంచి న్యూజెర్సీకి స్పిరిట్ ఎయిర్ లైన్స్ విమానం ఒకటి బయలుదేరింది. అందులో నిండుగా ప్రయాణికులు ఉన్నారు. అంతలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ, ఓ గబ్బిలం విమానంలో ఎగరడం ప్రారంభించింది.

దీన్ని చూసిన పలువురు ప్రయాణికులు హడలిపోగా, ఇంకొందరు వాష్ రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ఈ తతంగాన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, స్పిరిట్ ఎయిర్ లైన్స్ తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాదిలో స్పిరిట్ విమానాల్లో గబ్బిలాలు కనిపించడం ఇది రెండోసారనీ, ఇకపై జీవితంలో స్పిరిట్ విమానయాన సంస్థ విమానాలు ఎక్కబోనని ఓ ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.
USA
Bat
Bird
Spirit airlines
Flight
Passengers tension

More Telugu News