america: అమెరికాలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో కాల్పులు.. 20 మంది మృతి

  • టెక్సాస్‌లోని ఎల్‌పాసోలో ఘటన
  • పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
  • కాల్పుల శబ్దం విని భయంతో పరుగులు తీసిన జనం
గత అర్ధరాత్రి అమెరికాలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. టెక్సాస్ రాష్ట్రంలోని ఎల్‌పాసోలో ఉన్న వాల్‌మార్ట్ స్టోర్‌లో ఈ దుర్ఘటన జరిగింది. కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు టెక్సాస్ లెఫ్టినెంట్ గవర్నర్ డాన్‌ ప్యాట్రిక్‌ తెలిపారు. దుండగులు పెద్ద ఎత్తున కాల్పులకు తెగబడినట్టు ఎల్‌పాసో మేయర్ డీ మార్గో పేర్కొన్నారు. కాగా, దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో ఏం జరుగుతోందో తెలియక స్టోర్‌లోని వారు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
america
texas
gun fire
el paso

More Telugu News