Karnataka: రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నా: కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు

  • ఇటీవలే సీఎం పదవిని కోల్పోయిన కుమారస్వామి
  • రాజకీయాలు మంచివాళ్ల కోసం కాదంటూ వ్యాఖ్య
  • తన కుటుంబాన్ని కులాల రొంపిలోకి లాగవద్దంటూ విజ్ఞప్తి
నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటక సీఎం పదవిని కోల్పోయిన కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు మంచి వాళ్ల కోసం కాదని, రాజకీయాలు కులాలతో ముడిపడి ఉన్నాయని అన్నారు. కులాల రొంపిలోకి తన ఫ్యామిలీని లాగవద్దని, ప్రశాంతంగా గడిపేందుకు రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. ప్రస్తుత రాజకీయాలు ఎటువైపు పయనిస్తున్నాయో గమనిస్తున్నానని, ఎవరినో సంతోషపెట్టేందుకు తాను రాజకీయాల్లో లేనని స్పష్టం చేశారు. ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేశానని, తనకు ఆ సంతృప్తి చాలని అన్నారు. "ఊహించని విధంగా రాజకీయాల్లోకి వచ్చాను, ఊహించని విధంగా సీఎం అయ్యాను... రెండుసార్లు సీఎం అయ్యానంటే అది ఆ భగవంతుడి చలవే" అంటూ వ్యాఖ్యానించారు.
Karnataka
Kumaraswamy

More Telugu News