Surya: సూర్య సినిమా వాయిదాపడే అవకాశం

  • సూర్య కథానాయకుడిగా 'కాప్పాన్'
  • కీలకమైన పాత్రలో మోహన్ లాల్
  •  తమిళ .. తెలుగు భాషల్లో విడుదల

సూర్య కథానాయకుడిగా తమిళంలో 'కాప్పాన్' రూపొందింది. కేవీ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోహన్ లాల్ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ముందుగా ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అయితే, అదే రోజున 'సాహో' విడుదలవుతుందనే ప్రచారం కారణంగా ఆగస్టు 30వ తేదీకి వాయిదా వేసుకున్నారు. తెలుగులోనూ ఈ సినిమాను 'బందోబస్త్' పేరుతో విడుదల చేయాలనుకున్నారు.

చిత్రంగా 'సాహో' కూడా అదే తేదీకి వెళ్లింది. దాంతో మరోసారి 'కాప్పాన్' విడుదల తేదీ మారనుందనే టాక్ వినిపించింది. అందుకు తగినట్టుగానే ఈ సినిమాను సెప్టెంబర్ 20వ తేదీన విడుదల చేస్తే బాగుంటుందనే అభిప్రాయానికి నిర్మాతలు వచ్చారనేది తాజా సమాచారం. మరి ఈ మార్పు తమిళ సినిమా విషయంలోను జరుగుతుందా? తెలుగు వెర్షన్ కి మాత్రమేనా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది.

More Telugu News