Chiranjeevi: తండ్రి పోయిన విషాదంలో ఉన్న రాజీవ్ కనకాలకు చిరంజీవి ఓదార్పు

  • అనారోగ్యంతో దేవదాస్ కనకాల కన్నుమూత
  • దేవదాస్ భౌతికకాయాన్ని సందర్శించిన చిరంజీవి
  • ఆయన లేని లోటు తీరనిదంటూ వ్యాఖ్యలు
టాలీవుడ్ సీనియర్ నటుడు, నటనా శిక్షకుడు దేవదాస్ కనకాల అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంతకుముందు, దేవదాస్ కనకాల భౌతికకాయాన్ని టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవి సందర్శించారు. ఈ సందర్భంగా దేవదాస్ కనకాల తనయుడు రాజీవ్ కనకాలను ఓదార్చారు. దేవదాస్ మరణానికి దారితీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. విషాదానికి లోనైన రాజీవ్, తదితరులతో చిరంజీవి ధైర్య వచనాలు పలికారు.

అంతేకాకుండా, దేవదాస్ నటనా శిక్షణలో తన తొలిరోజులను చిరంజీవి జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఆయన లేని లోటు తీరనిదని, అయితే ఆయన జ్ఞాపకాలు మిగిలే ఉంటాయని పేర్కొన్నారు. కాగా, చిరంజీవిని చూడగానే దేవదాస్ కనకాల కుమార్తె శ్రీలక్ష్మి భావోద్వేగాలు భరించలేక భోరున విలపించారు. ఆమెను కూడా చిరంజీవి వాత్సల్యంతో దగ్గరికి తీసుకుని అనునయించారు.

Chiranjeevi
Tollywood
Devadas Kanakala
Rajiv kanakala
Sri Lakshmi

More Telugu News