ట్రోలర్స్ విమర్శలకు దీటుగా జవాబిచ్చిన నటి ఖుష్బూ!

03-08-2019 Sat 15:19
  • ఖుష్బూ మతాన్ని ప్రస్తావించిన ఆకతాయిలు
  • వ్యక్తిగతంగా విమర్శలు చేసిన వైనం
  • దమ్ముంటే నిజమైన ఫొటోలు డీపీలుగా పెట్టాలని ఖుష్బూ సవాల్
తన మతం ఆధారంగా విమర్శలు గుప్పిస్తున్న ట్రోలర్స్ పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ప్రముఖ నటి ఖుష్బూ తీవ్రంగా మండిపడ్డారు. ముస్లింను కాబట్టి తనను జిహాదీగా విమర్శిస్తున్న వారంతా దమ్ముంటే తమ అసలు ఫొటోలతో, గుర్తింపుతో విమర్శించాలని సవాల్ విసిరారు.

‘మీరు చేసే దూషణలు నాపై ఎలాంటి ప్రభావమూ చూపవు. నేను భారతీయురాలిని. నేను భారతీయురాలిగానే పుట్టా.. భారతీయురాలిగానే మరణిస్తా. మూర్ఖపు భక్తుల్లారా.. రాముడి పేరును అపవిత్రం చేయకండి. కొంచెమయినా సిగ్గుపడండి’ అని ఘాటుగా విమర్శించారు. ఖుష్బూ అసలు పేరు నఖత్ ఖాన్. ఆమె 1997లో దర్శకుడు సుందర్ ను వివాహం చేసుకున్నారు. సినిమాల్లోకి వచ్చాక తన పేరును ఖుష్బూగా మార్చుకున్నారు.