Kohli: ఓటమి తర్వాత కొన్ని రోజులు దారుణంగా గడిచాయి: కోహ్లీ

  • ఓటమిని జీర్ణించుకోవడం మా వల్ల కాలేదు
  • నిద్ర లేవగానే ఓటమి గుర్తుకు వచ్చేది
  • రోజువారీ కార్యక్రమాల్లో పడి ఓటమిని మర్చిపోయేందుకు యత్నించాం
ప్రపంచకప్ లో ఓటమి తమను కొన్ని రోజుల పాటు వెంటాడిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన తర్వాత కొన్ని రోజులు దారుణంగా గడిచాయని... ఓటమిని జీర్ణించుకోవడం తమ వల్ల కాలేదని చెప్పాడు. ప్రపంచ కప్ ముగిసేంత వరకు నిద్ర లేవంగానే ఓటమే గుర్తుకు వచ్చేదని తెలిపాడు. రోజువారీ కార్యక్రమాల్లో పడి ఓటమిని మర్చిపోయేందుకు యత్నించామని చెప్పాడు. ఓటమిని మర్చిపోయి, ముందుకు సాగడంపై ప్రస్తుతం దృష్టి సారించామని తెలిపాడు.

ధోనీ లేకపోవడం యువ వికెట్ కీపర్-బ్యాట్స్ మెన్ రిషభ్ పంత్ కు చక్కటి అవకాశమని కోహ్లీ చెప్పాడు. వచ్చిన అవకాశాన్ని పంత్ సద్వినియోగం చేసుకుంటాడనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. మిడిల్ ఆర్డల్ లో బ్యాటింగ్ సామర్థ్యాన్ని నిరూపించుకుని ధోనీ, పాండ్యా లేని లోటును తీర్చాలని అన్నాడు. విండీస్ పర్యటనకు పాండ్యాకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.
Kohli
World Cup
Team India

More Telugu News