Telangana: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డిని ఖరారు చేసిన సీఎం కేసీఆర్!

  • గుత్తాకు సమాచారం ఇచ్చిన ముఖ్యమంత్రి
  • సీఎంకు ధన్యవాదాలు తెలిపిన టీఆర్ఎస్ నేత
  • యాదవరెడ్డిపై అనర్హత వేటుతో గుత్తాకు ఛాన్స్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్ఎస్ సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును ఖరారు చేశారు. పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయాలని గుత్తా సుఖేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దీంతో ప్రగతిభవన్ కు చేరుకున్న గుత్తా ముఖ్యమంత్రికి  కృతజ్ఞతలు చెప్పారు. గుత్తా నామినేషన్ పత్రాల దాఖలు ప్రక్రియలో సహకరించాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డికి కేసీఆర్ సూచించారు. జనతా పార్టీతో గుత్తా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. అనంతరం ఆయన టీడీపీలో చేరి పనిచేశారు.

దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆహ్వానంతో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2009లో నల్గొండ లోక్ సభ స్థానం నుంచి గెలుపొందారు. కానీ ఏపీ విభజన అనంతరం రాజకీయ పరిస్థితులు మారడంతో టీఆర్ఎస్ లో చేరారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గుత్తాకు తెలంగాణ రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవిని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ యాదవరెడ్డిపై అనర్హతవేటు పడటంతో గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన స్థానంలో పోటీ చేస్తున్నారు.

More Telugu News