ప్రజల్ని ప్రలోభపెట్టేందుకు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లలో రూ.150 కోట్ల స్కాం జరిగింది: విజయసాయిరెడ్డి
- అన్న క్యాంటీన్ల విషయంలో మాటల యుద్ధం
- క్యాంటీన్లు మూసివేస్తున్నారంటూ టీడీపీ ఆందోళన
- తక్కువ ధరకు భోజనం పెట్టే పథకంలో కూడా దోచుకున్నారంటూ విజయసాయి కౌంటర్
ఎన్నికల ముందు ప్రజల్ని ప్రలోభపెట్టేందుకే చంద్రబాబు సర్కారు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిందని, అన్న క్యాంటీన్ల నిర్మాణంలో రూ.150 కోట్ల మేర కుంభకోణం జరిగిందని ట్వీట్ చేశారు. చివరికి పేదవాళ్లకు అతి తక్కువ ధరకు భోజనం పెట్టే పథకంలో కూడా దోచుకున్నారంటూ మండిపడ్డారు. రూ.2 లక్షలతో నిర్మించే క్యాంటీన్ కు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చయిందంటూ లెక్కలు చూపారని విజయసాయి ఆరోపించారు.