IBM: గత ఐదేళ్లలో లక్ష మంది సీనియర్లను తొలగించిన ఐబీఎం... కోర్టుకెక్కిన ఉద్యోగులు!

  • వయసు పెరిగిందన్న కారణంతో తొలగింపు
  • అన్యాయంగా తొలగించారని కోర్టును ఆశ్రయించిన మాజీ ఉద్యోగి
  • సంస్థ భవిష్యత్తు కోసమేనన్న ఐబీఎం

ఐబీఎంలో గడచిన ఐదేళ్ల కాలంలో దాదాపు లక్ష మంది సీనియర్ ఉద్యోగులను తొలగించారని, కంపెనీని యువతరంతో నింపాలన్న ఉద్దేశంతోనే ఇది జరిగిందని, పనితీరు బాగానే ఉన్నా ఉద్యోగులను తొలగించడం అన్యాయమంటూ శాన్ ఫ్రాన్సిస్కో న్యాయస్థానాన్ని కొందరు తొలగించబడిన ఉద్యోగులు ఆశ్రయించారు. కోర్టు రిజిస్ట్రార్ వెల్లడించిన వివరాల ప్రకారం, గతంలో ఐబీఎంలో పని చేసి తొలగించబడిన జొనాథన్ లాంగ్లే ఈ కేసును వేశారు. తన వయసు 61 సంవత్సరాలని, తనను కేవలం వృద్ధుడన్న కారణంతోనే తొలగించారని ఆయన ఆరోపించారు.

108 సంవత్సరాల చరిత్ర ఉన్న ఐబీఎంలో ఎంతో మంది దశాబ్దాల తరబడి పనిచేసిన వారున్నారు. కాగా, ఉద్యోగుల తొలగింపు ఆరోపణలపై స్పందించిన ఐబీఎం, "ప్రతి సంవత్సరమూ మేము 50 వేల మంది ఉద్యోగులను నియమిస్తున్నాం. వారికి శిక్షణ ఇచ్చేందుకు అర బిలియన్ డాలర్లను ఖర్చు పెడుతున్నాం. మాకు రోజుకు 8 వేల దరఖాస్తులు వస్తుంటాయి. ఏ నిర్ణయం తీసుకున్నా సంస్థ భవిష్యత్తు కోసమే తీసుకుంటాం" అని పేర్కొంది. కాగా, అమెజాన్, గూగుల్ తదితర సంస్థలు కూడా వయసు పెరిగిన సీనియర్లను తొలగించి, వారి స్థానంలో యువతరాన్ని నింపుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News