TTD: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల.. మొత్తం 69,254

  • నవంబరు నెలకు సంబంధించినవి
  • ఎలక్ట్రానిక్‌ లాటరీ విధానంలో 10,904 కేటాయింపు
  • కరెంటు బుకింగ్‌ కింద 58,350

తిరుమల తిరుపతి దేవస్థానం నవంబర్‌ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసింది. తిరుమల శ్రీవారికి అందించే వివిధ సేవల్లో పాల్గొనేందుకు భక్తులకు ఈ టికెట్లు కేటాయిస్తుంది. మొత్తం 69,254 టికెట్లు విడుదల చేయగా ఇందులో ఎలక్ట్రానిక్‌ లాటరీ విధానంలో 10,904 కేటాయించనున్నారు. మిగిలిన 58,350 టికెట్లను కరెంటు బుకింగ్‌ కింద కేటాయిస్తారు.

టికెట్లను ‌www.tirumala.org వెబ్‌సైట్‌ ద్వారా ఈరోజు ఉదయం 10 గంటల నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఎలక్ట్రానిక్‌ లాటరీ విధానం కింద కేటాయించే 10,904 సేవా టికెట్లలో సుప్రభాత సేవకు 7549, తోమాల సేవకు 120, అర్చనకు 120, అష్టదళ పాదపద్మారాధనకు 240, నిజపాద దర్శనం కోసం 2875 టికెట్లను విడుదల చేసింది.

కరెంటు బుకింగ్‌ కింద 58,350 ఆర్జిత సేవా టికెట్లను విడుదల  చేయగా ఇందులో విశేష పూజ 1,500, కల్యాణోత్సవం 13,300, ఊంజల్‌సేవ 4,200, ఆర్జిత బ్రహ్మోత్సవం 7,700, వసంతోత్సవం 14,850, సహస్రదీపాలంకరణ టికెట్లు 16,800 ఉన్నాయి. మరోవైపు జూలైలో శ్రీవారి హుండీ ద్వారా రూ.106.28 కోట్ల రికార్డు ఆదాయం సమకూరినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.

More Telugu News