Thor: 6 ప్యాక్ బాడీని వదిలేసి... పొట్టపెంచి లావైపోయిన 'అవెంజర్స్ ధోర్'... ఎలా మారాడో తెలిపే వీడియో ఇదిగో!

  • సుత్తి పట్టి శత్రువులను చెండాడే థానోస్
  • 'ఎండ్ గేమ్' చిత్రం చివరిలో ఫ్యామిలీ ప్యాక్
  • ఎలా మారాడన్న విషయాన్ని చూపిన క్రిస్

అవెంజర్స్ హీరో థోర్... ఈ పేరు వింటేనే చిన్నారులు ఎగిరి గంతేస్తారు. చేతిలో సుత్తి పట్టుకుని, శత్రువులను చీల్చి చెండాడుతూ కనిపిస్తాడు. ఈ పాత్రను క్రిస్ హేమ్స్ వర్త్ పోషించాడన్న సంగతి తెలిసిందే. 'అవెంజర్స్ -ఎండ్ గేమ్' చిత్రంలో థానోస్‌ అంతం తరువాత థోర్ చాలా దూరంగా వెళ్లి బతుకుతున్నట్టు చూపిస్తారు. ఆ సమయంలో ఆయన సిక్స్ ప్యాక్ బాడీని వదిలేసి ఫ్యామిలీ ప్యాక్ లో, పెద్ద పొట్ట, జారిపోయిన చేతి కండలతో కనిపిస్తాడు. ఇక సిక్స్ ప్యాక్ క్రిస్ హేమ్స్ వర్త్, ఫ్యామిలీ ప్యాక్ లోకి ఎలా మారిపోయాడు? ఈ విషయాన్ని క్రిస్ స్వయంగా ఓ వీడియోను పోస్టు చేస్తూ తెలిపాడు. ఊబకాయుడిగా తాను ఎలా మారిపోయానన్న విషయాన్ని వెల్లడించాడు. ఆ వీడియోను మీరూ చూడండి.

More Telugu News