Telangana: ఆయుర్వేద భవన్ ను ఎందుకు తరలిస్తున్నారు?: వీహెచ్

  • దీన్ని తరలించడం వెనుక ఉన్న ఆంతర్యమేంటి?
  • ఆసుపత్రి భవనం పాతదని కారణం చెబుతారా?
  • అలా అయితే, ఉస్మానియా ఆసుపత్రి కూడా పాతదే
చార్మినార్ లోని ఆయుర్వేద భవన్ ని తరలించ వద్దని నిన్న అక్కడి వైద్య విద్యార్థినులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై టీ-కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య విద్యార్థినులు ధర్నా చేస్తున్నప్పుడు పోలీసులు ఎందుకు తప్పుగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? అని ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో ఆయుష్ కమిషనర్ అలుగు వర్షిణిని ఆయన కలిశారు. అనంతరం, మీడియాతో వీహెచ్ మాట్లాడుతూ, ఈ ఆసుపత్రిని ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నించారు. దీన్ని తరలించడం వెనుక ఉన్న ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఆసుపత్రి భవనం పాతది కనుక అక్కడి నుంచి తరలిస్తున్నారని చెప్పడం సబబు కాదని, ఉస్మానియా ఆసుపత్రి కూడా పాతదైనా అక్కడే వైద్యం కొనసాగుతోందని అన్నారు. అక్కడే నిర్మిస్తామని చెప్పిన ఆసుపత్రి కొత్త భవనం ఏమైందని ఈ సందర్భంగా వీహెచ్ ప్రశ్నించారు.
Telangana
charminar
Ayurveda Bhavan
VH

More Telugu News