Chandrababu: పట్టిసీమ వృథా అన్నవారికి ఈ విషయం ఎప్పటికీ అర్థంకాదు: చంద్రబాబు ట్వీట్

  • శ్రీశైలం, నాగార్జున సాగర్ లో నీళ్లు లేకపోయినా ప్రకాశం బ్యారేజ్ కళకళలాడుతోందన్న చంద్రబాబు
  • పట్టిసీమ పుణ్యమేనంటూ వెల్లడి
  • నదుల అనుసంధానం ప్రయోజనం ఇదేనని ట్విట్టర్ లో వ్యాఖ్యలు
పట్టిసీమ ప్రాజక్టును వృథా అని భావించినవారు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజక్టుల్లో నీళ్లు లేకపోయినా, దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజి నీళ్లతో ఎలా కళకళలాడుతోందో గమనించాలని చంద్రబాబు ట్వీట్ చేశారు. పట్టిసీమ పుణ్యమా అని ప్రకాశం బ్యారేజికి గోదావరి వరద జలాలు వచ్చాయని, నదుల అనుసంధానం వల్ల కలిగే ప్రయోజనం ఇదేనని స్పష్టం చేశారు. పట్టిసీమ కట్టడం దండగ అన్నవారికి ఈ విషయం ఎప్పటికీ అర్థంకాకపోవచ్చంటూ వ్యాఖ్యానించారు. అంతేగాకుండా, పోలవరం గురించి కూడా మరో ట్వీట్ చేశారు.

పోలవరానికి పునాదులే పడలేదంటూ పాదయాత్రలో ప్రచారం చేసినవాళ్లు ఇవాళ రివర్స్ స్లూయిస్ గేట్ల ద్వారా 2 లక్షల క్యూసెక్కుల వరదజలాలను ఎలా మళ్లించగలిగారంటూ సీఎం జగన్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. వైరి పక్షాల అవహేళనల మధ్యే 70 శాతం పనులు పూర్తిచేయగలిగామని, మిగతా 30 శాతం పూర్తిచేయకపోతే పోలవరం అనేది ఒక కలగానే మిగిలిపోతుందని చంద్రబాబు తన ట్వీట్ లో స్పష్టం చేశారు.
Chandrababu
Pattiseema
Prakasham Barrage
Polavaram

More Telugu News