Sampoornesh Babu: 'కొబ్బరి మట్ట' నుంచి సాంగ్ టీజర్

  • హాస్యకథా చిత్రంగా 'కొబ్బరిమట్ట'
  • మూడు విభిన్నమైన పాత్రల్లో సంపూ 
  • ఈ నెల 10వ తేదీన విడుదల   

తెలుగు తెరపై హాస్య కథానాయకులుగా సందడి చేస్తోన్న వారిలో సంపూర్ణేశ్ బాబు ఒకరు. టైటిల్ దగ్గర నుంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం సంపూ ప్రత్యేకత. ఆయన తాజా చిత్రంగా 'కొబ్బరిమట్ట' సినిమా నిర్మితమైంది. ఈ నెల 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. భూలోకాన్ని బంతిని చేసి ఫుట్ బాల్ ఆడేస్తాడు .. భూకంపం వచ్చేవేళ ఉయ్యాలూగేస్తాడు అంటూ సంపూ పాత్రను ఒక రేంజ్ కి ఎత్తేస్తూ ఈ పాట సాగింది. 'ఆండ్రాయుడు' పాత్రపై చిత్రీకరించిన ఈ పాత్రలో సంపూ చాలా స్టైలీష్ గా కనిపిస్తూ నవ్వించాడు. కథ - స్క్రీన్ ప్లే - మాటలను స్టీవెన్ శంకర్ అందించిన ఈ సినిమాకి, రూపక్ రోనాల్డ్ సన్ దర్శకత్వం వహించాడు.

More Telugu News