Karthikeya: ఈ కథకు కార్తికేయ కరెక్ట్ అనిపించిందంతే: దర్శకుడు అర్జున్ జంధ్యాల

  • 'గుణ 369' దర్శకుడిగా అర్జున్ జంధ్యాల 
  • ఈ కథను కార్తికేయకు మాత్రమే వినిపించాను
  • కార్తికేయ గొప్పగా చేశాడన్న అర్జున్ జంధ్యాల      

అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన 'గుణ 369' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఇది 'గుణ' అనే యువకుడి ప్రేమకథ .. 369 అనేది ఆ యువకుడు ఖైదీగా వున్నప్పటి నెంబర్. ఈ కథను నేను రాసుకున్నాక ఎవరికీ వినిపించలేదు. ఎవరైతే ఈ పాత్రకి కరెక్టుగా సెట్ అవుతారని నేను ఆలోచన చేస్తున్న సమయంలోనే 'ఆర్ ఎక్స్ 100' సినిమా చూశాను.

ఆ సినిమాలో కార్తికేయను చూసిన తరువాత నా సినిమాలో హీరో పాత్రకి ఆయన అయితేనే కరెక్టుగా సెట్ అవుతాడనిపించింది. దాంతో ఆయనను కలిసి కథ చెప్పాను. కథ వినగానే ఆయన ఓకే చెప్పేశాడు. నేను అనుకున్నట్టుగానే ఈ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. కార్తికేయ కెరియర్లో ఇది గుర్తుండిపోయే పాత్ర అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు" అని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News