Sudigali Sudheer: బిగ్ బాస్ హౌస్ లోకి 'సుడిగాలి' సుధీర్

  • 'జబర్దస్త్' ద్వారా మంచి క్రేజ్ 
  • సినిమాల్లోను వరుస అవకాశాలు
  •  'సాఫ్ట్ వేర్ సుధీర్'తో హీరోగా ఛాన్స్ 
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా బాగా పాప్యులర్ అయిన కమెడియన్స్ లో సుడిగాలి సుధీర్ ఒకరు. ఒక వైపున 'జబర్దస్త్' తో పాటు మరికొన్ని టీవీ షోలు చేస్తూ, మరో వైపున సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు చేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే హీరోగాను ఆయనకి అవకాశం వచ్చింది. 'సాఫ్ట్ వేర్ సుధీర్' అనే టైటిల్ తో ఈ సినిమా నిర్మితమైంది. త్వరలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమాను ప్రమోట్ చేసుకోవడం కోసం, సుడిగాలి సుధీర్ బిగ్ బాస్ హౌస్ లోకి రానున్నట్టుగా తెలుస్తోంది. 'బిగ్ బాస్' .. 'బిగ్ బాస్ 2' సీజన్ సమయంలోను 'బిగ్ బాస్ హౌస్' ద్వారా సినిమాల ప్రమోషన్స్ జరిగాయి. అలా తన సినిమా ప్రమోషన్ కోసం త్వరలో బిగ్ బాస్ హౌస్ లోకి సుడిగాలి సుధీర్ అడుగుపెట్టనున్నట్టుగా చెబుతున్నారు. 
Sudigali Sudheer

More Telugu News