Puri Jagannadh: అభిమాని హృదయంపై టాటూగా పూరీ ఫొటో... ఆ ఆనంద క్షణాలను వీడియో తీసిన చార్మీ!

  • 'ఇస్మార్ట్ శంకర్' విజయంతో ఆనందంగా గడుపుతున్న పూరీ
  • సినిమా థియేటర్ల వద్ద ప్రమోషన్
  • ప్రభాకర్ అభిమానాన్ని చూసి ఫిదా
చానాళ్ల తరువాత 'ఇస్మార్ట్ శంకర్' విజయంతో పూరీ జగన్నాథ్ ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడాయన తన టీమ్ తో సంబరాలు చేసుకుంటూ, సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద అభిమానులతో కలిసి సందడి చేస్తున్నాడు. ఆయన వెంట సినిమా సహ నిర్మాత చార్మీ సహా చిత్ర యూనిట్ కూడా పర్యటిస్తోంది. ఇటీవల సినిమా ప్రమోషన్ లో భాగంగా పూరీ జగన్నాథ్ టీమ్, హన్మకొండకు వచ్చిన వేళ, పూరీకి స్వీట్ షాక్ ఇచ్చాడో వీరాభిమాని. తన హృదయంపై పూరీ జగన్నాథ్ బొమ్మనే పచ్చబొట్టు పొడిపించుకున్న ప్రభాకర్, దాన్ని కారులో కూర్చున్న పూరీకి చూపించాడు.

ఈ దృశ్యాన్ని ఆయన పక్కనే ఉన్న చార్మీ వీడియో తీసి తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులకు షేర్ చేసింది. "ఓ డైహార్డ్ ఫ్యాన్ ప్రభాకర్ ఒంటిపై పూరీ జగన్ టాటూ. థ్యాంక్యూ సో మచ్. నువ్వు నా హృదయాన్ని టచ్ చేశావు" అని క్యాప్షన్ పెట్టింది. కాగా, త్వరలో కన్నడ నటుడు, కేజీఎఫ్‌ తో ఓవర్ నైట్ స్టార్‌ గా మారిన యష్‌ హీరోగా ఓ సినిమా చేసేందుకు పూరీ రెడీ అవుతున్నారని సమాచారం.
Puri Jagannadh
Tatoo
Charmi
Prabhakar
Warangal

More Telugu News