Karnataka: రెండు నెలల క్రితం కులాంతర ప్రేమ వివాహం... ఉరేసుకున్న యువతి!

  • కర్ణాటకలోని మాండ్యా ప్రాంతంలో ఘటన
  • అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
  • అత్తమామలు, భర్తే చంపారంటున్న తల్లిదండ్రులు
రెండు నెలల క్రితం కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మరణించింది. కర్ణాటకలోని మాండ్య తాలూకా తిబ్బనహళ్లి ప్రాంతంలో ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, మాచహళ్లి గ్రామానికి చెందిన అర్పిత (19), అదే గ్రామానికి చెందిన యతిన్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి కులాలు వేర్వేరు కావడంతో ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించలేదు.

దీంతో వారు గడచిన మే నెలలో ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి అర్పితను తమ ఇంట్లోకి రానివ్వలేదు ఆమె తల్లిదండ్రులు. ఈ క్రమంలో యతిన్‌ తో పాటు తను కాపురం చేస్తున్న ఇంట్లోనే అర్పిత ఉరేసుకొన్న స్థితిలో విగతజీవిగా కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి, కేసును విచారిస్తున్నామని తెలిపారు. కాగా, భర్త, అత్తమామలే తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చూపుతున్నారని అర్పిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
Karnataka
Sucide
Lovers
Caste
Marriage

More Telugu News