Chandrababu: చంద్రబాబు పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ

  • చంద్రబాబునాయుడికి భద్రతను తగ్గించిన ప్రభుత్వం
  • గతంలోనే హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం
  • ఎక్కువ భద్రతే ఇస్తున్నామంటున్న గౌతమ్ సవాంగ్

తనకు భద్రత కుదించడాన్ని సవాల్ చేస్తూ, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దాఖలు వేసిన పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణను ప్రారంభించనుంది. తనకు కుదించిన భద్రతను తిరిగి పునరుద్దరించాలని చంద్రబాబు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ విషయంలో చంద్రబాబుకు తాము భద్రతను కుదించలేదని, నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన భద్రత కంటే ఎక్కువే కల్పిస్తున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

కాగా, ఏపీలో ప్రభుత్వం మారిన తరువాత చంద్రబాబు భద్రతా టీమ్ లోని 15 మందిని జగన్ ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. గతంలో బాబుకు ఒక అడిషనల్‌ ఎస్పీ, డీఎస్పీ, ముగ్గురు ఆర్‌ఐలు భద్రతా విధుల్లో ఉండగా, వారిని తొలగిస్తూ, ప్రస్తుతం 'టు ప్లస్‌ టు' పధ్ధతిలో భద్రతా సిబ్బందిని కేటాయించారు. చంద్రబాబు కుటుంబానికి, చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో ఆయన నివాసానికి కల్పిస్తున్న భద్రతను కూడా తగ్గించారు. దీనిపై నేడు హైకోర్టులో విచారణ ప్రారంభం కానుంది.

More Telugu News