Bhuma akhilapriya: ‘భూమా’ వారసుడిగా జగత్ విఖ్యాత్ రెడ్డి.. ప్రకటించిన అఖిలప్రియ

  • భూమా కుటుంబం ఎప్పటికీ విడిపోదు
  • విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్న వారికి నిరాశే
  • నేను ఎప్పటికీ టీడీపీలోనే

భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల రాజకీయ వారసుడిగా తన తమ్ముడు భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డిని మాజీ మంత్రి అఖిలప్రియ ప్రకటించారు. మంగళవారం ఆళ్లగడ్డలోని తన స్వగృహంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూమా కుటుంబం ఎప్పటికీ విడిపోదన్నారు. కుటుంబాన్ని చీల్చాలని కొందరు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాబోవన్నారు. ఈ సందర్భంగా తన తల్లిదండ్రుల వారసుడిగా  భూమా జగత్‌ విఖ్యాత్‌రెడ్డిని ప్రకటించారు.

తన కోసం నష్టపోయినవారు ఎంతోమంది ఉన్నారని, వారికి అండగా ఉంటానని ఈ సందర్భంగా అఖిలప్రియ హామీ ఇచ్చారు. రానున్న స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని, టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేయాలని కోరారు. తాను టీడీపీని వీడే ప్రసక్తే లేదని, పార్టీ మారుతున్నట్టు వస్తున్న పుకార్లను నమ్మొద్దని కార్యకర్తలను కోరారు.

  • Loading...

More Telugu News