Vijay Devarakonda: 'గీత గోవిందం' దర్శకుడితో విజయ్ దేవరకొండ

  • 'గీత గోవిందం'తో హిట్ కొట్టిన పరశురామ్ 
  • విజయ్ దేవరకొండ క్రేజ్ ను పెంచిన చిత్రం 
  • ఖాళీగా వున్న పరశురామ్ కి ఛాన్స్ ఇచ్చిన విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ హీరోగా చేసిన 'గీత గోవిందం' సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆయన కెరియర్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. దర్శకుడిగా ఈ సినిమా పరశురామ్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఆయన మహేశ్ బాబుతో ఒక సినిమా చేయాలనుకున్నాడుగానీ కుదరలేదు.

అల్లు అర్జున్ తో సెట్స్ పైకి వెళ్లడానికి గట్టి ప్రయత్నాలే చేశాడుకానీ అదీ వర్కౌట్ కాలేదు. 'సరిలేరు నీకెవ్వరు'తో మహేశ్ బాబు, త్రివిక్రమ్ సినిమాతో బన్నీ బిజీ అయ్యారు. దాంతో పరశురామ్ ఖాళీగా వుండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆయన పరిస్థితిని అర్థం చేసుకున్న విజయ్ దేవరకొండ, తనతో సినిమా చేసుకోమంటూ ఛాన్స్ ఇచ్చేశాడట. ప్రస్తుతం పరశురామ్ అందుకు సంబంధించిన పనుల్లోనే వున్నాడని సమాచారం. ఈ ప్రాజెక్టు ఎప్పటి నుంచి పట్టాలెక్కుతుందనేది చూడాలి మరి.

  • Loading...

More Telugu News