Qatar: సైమా-2019 అవార్డ్సు..గౌరవ అతిథులుగా చిరంజీవి, మోహన్ లాల్

  • ఖతార్ వేదికగా రెండు రోజుల పాటు సైమా వేడుకలు
  • ఆగస్టు 15న గౌరవ అతిథిగా హాజరుకానున్న చిరంజీవి
  • 16న మలయాళ నటుడు మోహన్ లాల్
దక్షిణ భారత దేశంలోని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు సంబంధించిన సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్సు)-2019 అవార్డుల వేడుకను రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఖతార్ లో నిర్వహించే ఈ వేడుకకు టాలీవుడ్, మాలీవుడ్ ప్రముఖ నటులు చిరంజీవి, మోహన్ లాల్ లు వరుసగా ఆగస్టు 15, 16 తేదీల్లో గౌరవ అతిథులుగా హాజరుకానున్నారు. కాగా,సైమా వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. 
Qatar
siima
awards
Chiranjeevi
Mohanlal

More Telugu News