Ummareddi: వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు అస్వస్థత... హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు

  • గుంటూరు కలెక్టరేట్ వద్ద ఎంపీఈవోల నిరసన
  • సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఉమ్మారెడ్డి
  • మీడియాతో మాట్లాడుతుంటే వాంతులు 
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. గుంటూరు కలెక్టరేట్‌ వద్ద ఈ ఉదయం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న వేళ, ఆయన వాంతులు చేసుకున్నారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ఎంపీఈవోలు రిలే నిరాహార దీక్షలు చేపట్టిన సంగతి తెలిసిందే. వారితో చర్చించి, సంఘీభావం తెలిపేందుకు ఉమ్మారెడ్డి వచ్చారు. వారితో మాట్లాడిన తరువాత, సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. ఈ సమయంలోనే ఆయన వాంతులు చేసుకోగా, చుట్టూ ఉన్నవారు వెంటనే అప్రమత్తమై, ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
Ummareddi
YSRCP
Guntur District
Hiopital

More Telugu News