coffeday: బేలూర్‌లోని తండ్రి ఎస్టేట్‌లోనే కాఫీ డే సిద్ధార్థ అంత్యక్రియలు

  • నిర్ణయించిన కుటుంబ సభ్యులు
  • వెల్లడించిన శృంగేరి ఎమ్మెల్యే రాజగౌడ
  • నదిలో దొరికిన 58 ఏళ్ల సిద్ధార్థ మృతదేహం 

తన కాఫీ షాపుల సామ్రాజ్యాన్ని దేశవ్యాప్తంగా విస్తరించి తెలివైన వ్యాపారవేత్తగా పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకుని, చివరికి తన జీవిత ప్రయాణాన్ని కడు విషాదంతో ముగించిన కాఫీ డే సిద్ధార్థ అంత్యక్రియలను బేలూరులో నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. బేలూరు తాలూకాలోని సిద్ధార్థ తండ్రికి చెందిన ఎస్టేట్‌లోనే ఆయన అంత్యక్రియలు జరగనున్నట్లు సిద్ధార్థ సన్నిహితుడు, శృంగేరీ ఎమ్మెల్యే టి.డి.రాజగౌడ తెలిపారు. ఈనెల 29వ తేదీన నేత్రావతి నది వద్దకు వెళ్లి అదృశ్యమైన 58 ఏళ్ల వి.జి.సిద్ధార్థ ఈరోజు ఉదయం నదిలో శవమై కనిపించిన విషయం తెలిసిందే. నదిలో ఎవరో దూకడం తాను చూశానంటూ ఓ జాలరి ఇచ్చిన సమాచారం మేరకు గాలింపు చర్యలు చేపట్టిన సహాయక బృందాలు ఎట్టకేలకు సిద్ధార్థ మృతదేహాన్ని గుర్తించగలిగాయి.

More Telugu News