Bigboss: శ్రీముఖిది చాడీలు చెప్పే మనస్తత్వం.. అక్కా అక్కా అంటూ వెన్నుపోటు పొడిచారు: హేమ

  • శ్రీముఖిది కన్నింగ్ క్యారెక్టర్
  • మంచిదాన్ని అనిపించుకునేందుకు తాపత్రయం
  • వ్యతిరేకంగా ఉంటే బయటకు పంపించే మనస్తత్వం
  • నాగార్జున చాలా నచ్చారు
బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక నటి హేమ, యాంకర్ శ్రీముఖిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శ్రీముఖిది కన్నింగ్ క్యారెక్టరే కాకుండా, చాడీలు చెప్పే మనస్తత్వమని హేమ తెలిపింది. అందరిలో తాను మంచిదాన్ని అనిపించుకునేందుకు తాపత్రయ పడుతుందని, తనకు ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే, వాళ్లను బయటకు బయటకు పంపించాలనే మనస్తత్వమని హేమ ఆరోపించింది. హౌస్‌మేట్స్ అంతా తనను అక్కా అక్కా అంటూ వెన్నుపోటు పొడిచారని తెలిపింది.

బిగ్‌బాస్ హౌస్‌లో తనకేమీ అర్థం కాలేదని, ఏమీ ప్రారంభించకుండానే బయటకు వచ్చానని, మళ్లీ వెళ్లే అవకాశం వస్తే అప్పుడు ఆలోచిస్తానని హేమ పేర్కొంది. బిగ్‌బాస్ హౌస్, కంటెస్టెంట్లతో పాటు నాగార్జున మరీ నచ్చారని హేమ తెలిపింది. తనను కిచెన్ టీమ్‌లో వేశారని, కిచెన్‌లోకి ఎవరూ రావొద్దని, తనకు సలహాలు ఇవ్వొద్దని చెప్పానని హేమ తెలిపింది.

తాను హౌస్ నుంచి బయటకు వచ్చినపుడు ఏడవలేదని, మీడియా అంత సమయం కూడా ఇవ్వలేదని చమత్కరించింది. తన బలం, బలహీనత మీడియాయేనని, ఏడవాలని అనిపిస్తే మీడియా ఎదుటే ఏడుస్తానని ఓ ప్రశ్నకు సమాధానంగా హేమ తెలిపింది.
Bigboss
Srimukhi
Hema
Nagarjuna
Contestants
Kitchen

More Telugu News