Shakeela: డబ్బుతో ప్రేమను కొనలేం .. కానీ నాకు మరో మార్గం లేదు: నటి షకీలా

  • షకీలాగానే ఉండటం ఇష్టం
  • పిల్లలను కనే ఆలోచన చేయలేదు 
  • తల్లి బాధ్యతను నేను మోయలేనన్న షకీలా  

తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో షకీలా మాట్లాడుతూ, తనకి ఎదురైన అనుభవాలను గురించి ప్రస్తావించారు. "దేవుడు ప్రత్యక్షమై మళ్లీ నా జీవితాన్ని రీ స్టార్ట్ చేయమని అడిగితే, మళ్లీ షకీలాగానే వుండాలని కోరుకుంటాను. అయితే అప్పుడు తల్లి వలన .. అక్క వలన .. ప్రేమించినవాళ్ల వలన మోసపోకుండా జాగ్రత్తగా ఉండగలుగుతాను.

ప్రేమ అనేది డబ్బులిచ్చి కొనుక్కునేది కాదని నాకు తెలుసు. కానీ నాకు అంతకి మించి మార్గం లేదు. అనునిత్యం నేను నా సన్నిహితులతో వుండాలని కోరుకుంటాను. అందుకు కారణం ఒంటరిగా వుండలేకనే. నేను పార్టీ ఇస్తాననే ఉద్దేశంతోనే అవతలవాళ్లు నా ఇంటికి వస్తారు .. నాపై ప్రేమతో కాదు అనే విషయం కూడా నాకు తెలుసు. ప్రేమించినవాళ్ల ద్వారా పిల్లలను కనాలనే ఆలోచన కూడా నేనెప్పుడూ చేయలేదు. ఎందుకంటే తల్లి బాధ్యత చాలా పెద్దది .. అంత బాధ్యతను నేను మోయలేను' అని చెప్పుకొచ్చారు.

More Telugu News